
ఆమెది అందమైన పొగరు!
తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రుతీహాసన్, సుహాసిని, విద్యుత్‌లేఖ రామన్, ప్రకాశ్ మోహన్‌దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ది వెర్డిక్. కృష్ణశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, అగ్ని ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై ప్రకాశ్ మోహన్‌దాస్, ఎన్.గోపికృష్ణన్ కలిసి నిర్మించారు. అరవింద్‌కృష్ణ చాయాగ్రహణం, ఆదిత్యరావ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిగా అమెరికాలో చిత్రీకరించడం విశేషం. హత్య, దానికి సంబంధించిన విచారణ వంటి పలు ఆసక్తికరమైన థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు ఆర్.పార్థిబన్ ఒక పాటను రాయడం విశేషం. కాగా మంగళవారం ఈ చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సుహాసిని, పార్థిబన్‌లతో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దర్శకుడు కృష్ణశంకర్ మాట్లాడుతూ ఒక్కో తమిళ నటుడు, నటి 10 మంది హాలీవుడ్ నటీ నటులకు సమానం అని అమెరికన్ నటీనటులు చెప్పారని అన్నారు. చిత్ర యూనిట్ సహకారంతోనే ది వెర్డిక్ చిత్రాన్ని 23 రోజుల్లో పూర్తి చేయగలిగినట్లు చెప్పారు. తనను హాలీవుడ్‌కు తీసుకెళ్లిన ఈ చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు అని నటి శ్రుతీహాసన్ పేర్కొన్నారు. పార్థిబన్ మాట్లాడుతూ ఇక్కడ సుహాసినిని చూస్తుంటే ఆమె అందమైన పొగరు అని అన్నారు. అలా పార్థిబన్ మాట్లాడుతుండగా సుహాసిని వేదికపైకి వచ్చి తన వయసు ఇప్పుడు 62 ఏళ్లని చెప్పడం విశేషం. నిర్మాత ప్రకాశ్‌మోహన్‌దాస్ మాట్లాడుతూ తాము ఇంతకుముందు పలు మాలీవుడ్ చిత్రాలు చేసినా, తమిళంలో నిర్మించిన తొలి చిత్రం ది వెవెర్డిక్ అని పేర్కొన్నారు. ఇందులో ఇంత మంది ప్రముఖ నటీనటులను నటింపజేయడం తమకే ఆశ్యర్యంగానూ, మరచిపోలేని అనుభవంగానూ ఉందన్నారు. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన గోపికి ధన్యవాదాలు అన్నారు. షూటింగ్‌లో తాను మన నటీనటులను చూసి చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రముఖ
నటీమణులతో
ది
వెర్డిక్
చిత్ర యూనిట్