
ఎంపికై న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు
కొరుక్కుపేట: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్ర హిందూ, దేవదాయ శాఖ మంత్రి నేతృత్వంలో మొదటి దశలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కొత్తగా ఎంపికై న 15 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టుల అభ్యర్థులకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ నియామక ఉత్తర్వులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్–2025 సంవత్సరానికి 144 పోస్టులకు నియామక పరీక్షను నిర్వహించిందని పేర్కొన్నారు. ఇందులో 15 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టులు కార్పోరేషన్‌కు ఎంపికయ్యారని తెలిపారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అదనపు ప్రదాన కార్యదర్శి కాకర్ల ఉష, చైన్నె మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రభాకర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ. శివజ్ఞానం,చీఫ్ ప్రాజెక్టు ఆర్గనైజర్ ఎస్.రుద్రమూర్తి, ఏ.బాలసుబ్రమణియన్, ఎన్.రవి కుమార్ పాల్గొన్నారు.
● అందజేసిన మంత్రి శేఖర్‌బాబు