
రెహ్మాన్, ప్రభుదేవా కాంబోలో మూన్‌వాక్
తమిళసినిమా: ఇంతకు ముందు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్‌ల కాంబోలో కాదలన్ తదితర సూపర్‌హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ కాంబో 25 ఏళ్ల తరువాత పని చేస్తున్న చిత్రం మూన్‌వాక్. దీనికి బిహైండ్ ఉడ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆ సంస్థ ప్రధానాధికారి మనోజ్. ఎన్‌ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు యోగిబాబు, అజూ వర్గీస్,అర్జున్ అశోకన్, సాట్స్, నిష్మా సంగప్పా,సుస్మిత నాయక్,రెడిన్ కింగ్‌స్లీ, మొట్టై రాజేంద్రన్, లొల్లు సభ స్వామినాథన్, గాయకుడు సంతోష్ జేకప్, దీపాశంకర్, రాజ్‌కుమార్ నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డాన్స్, సగీంతం, వినోదం కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్, ఎడిటింగ్ పనులు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం ఇతర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ పొందినట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి అనూప్ వి.శైలజా అందించారు. 25 ఏళ్ల తరువాత ప్రభుదేవా, ఏఆర్.రెహ్మాన్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.