
కోలాహలం..అగ్నిగుండ వసంతోత్సవం
అగ్నిగుండం ప్రవేశం చేస్తున్న భక్తులు
భక్తజనం
తిరుత్తణి: తిరుత్తణిలోని ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకల్లో పదివేల మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కలు చెల్లించుకున్నారు. తిరుత్తణిలోని ద్రౌపదీదేవి ఆలయంలో అగ్నిగుండ వేడుకలకు జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించి దీక్షలు చేపట్టారు. ఆదివారం ఉదయం దుర్యోధన వధ కీలక ఘట్టం అమితంగా ఆకట్టుకుంది. ఆలయం వద్ద మహిళలు పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా కంకణాలు ధరించిన భక్తులు పట్టణ వీధుల్లో ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండానికి పూజలు చేసి అమ్మ వారు అగ్నిగుండం ముందు కొలువుదీరగా బాణసంచా సంబరాలు నడుమ పది వేలకు పైగా భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రైల్వే పోలీసులు, పోలీసులు, అగ్నిమాపక. ఆరోగ్య శాఖ సిబ్బంది విధులు నిర్వహించారు. వేడుకల్లో తిరుత్తణి పరిసర ప్రాంతాల నుంచి 50 వేలకు పైబడిన భక్తులు పాల్గొనడంతో ఆలయం పరిసర ప్రాంతాల్లో కిక్కిరిశాయి. సోమవారం ఉదయం ధర్మరాజు పట్టాభిషేకంతో అగ్నిగుండ వసంతోత్సవానికి ముగింపు పలుకుతారు.
అలంకరణలో ద్రౌపదీదేవి

కోలాహలం..అగ్నిగుండ వసంతోత్సవం

కోలాహలం..అగ్నిగుండ వసంతోత్సవం