కొరుక్కుపేట: విమానం రన్‌వేపై ఎగిరేందుకు సిద్ధమైన సమయంలో పొరపాటున ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం కలకలం రేపింది. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని స్వదేశీ టర్మినల్ నుంచి న్యూఢిల్లీకి మంగళవారం రాత్రి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం 159 మంది ప్రయా ణికులతో బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వేపై వెళ్తుండగా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో అలారం మోగింది. దీంతో పైలెట్ విమానం నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్ కూర్చున్న ప్రయాణికుడు పొరపాటున సమీపంలోని బటన్ నొక్కడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
గంట ఆలస్యంగా ఢిల్లీకి బయలుదేరిన విమానం