
నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకుడి విగ్రహాలు
తిరుత్తణి: తిరుత్తణిలో హిందూ మున్నని ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లాయి. డీఎస్పీ విఘ్నేష్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసుల బందోబస్తు చేశారు. తిరుత్తణి పట్టణంతో పాటు సబ్ డివిజన్ వ్యాప్తంగా 300కు పైబడిన ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. చవితి వేడుకల్లో ఐదవ రోజైన గురువారం పట్టణంలో హిందు మున్నని ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్లి నంది నదిలో మిజ్జనం చేశారు. హిందూమున్నని, బీజేపీ నేతలు పాల్గొన్నారు.