
కుప్పుస్వామి(ఫైల్)
వేలూరు: నాటు తుపాకీతో కాల్చుకుని ఓ పారిశుధ్య కార్మి కుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని నాయకనరి గ్రామానికి చెందిన కుప్పుస్వామి(60). ఇతను నాయకనరి గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కొద్ది రోజుల క్రితం మృతిచెందింది. కుప్పుస్వామి తన ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటిరిగా ఉన్న సమయంలో ఇంటి నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. విన్న ఇరుగుపొరుగు వెంటనే కుప్పుస్వామి ఇంటి వద్దకు చేరుకొని పరిశీలించగా నాటు తుపాకీతో కుప్పుస్వామి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.