
వర్క్‌షాప్ ప్రారంభోత్సవంలో చైన్నె పోలీస్ కమిషనర్ సందీప్‌రాయ్ రాథోడ్
కొరుక్కుపేట: గ్రేటర్ చైన్నె పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ – ఇనన్‌స్పెక్టర్లు పని తీరును మెరుగుపరిచేందుకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేపేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రేటర్ చైన్నె పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో పోలీసులకు ఒత్తిడిని తగ్గించుకునేందుకు కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చారు. కానిస్టేబుళ్ల సంక్షేమం, ఫిర్యాదులు వినడం, పరిష్కరించడం, విధుల్లో ఉన్నప్పుడు కానిస్టేబుళ్ల పట్ల ఎలా ప్రవర్తించాలనే విషయాలపై తగిన సలహాలు అందించారు. మోటివేషనల్ స్పీకర్ డా.పి.ఆర్.సుబాస్ చంద్రన్ నేతృత్వంలో వర్క్‌షాప్ నిర్వహించి మానసిక ఆరోగ్యం, సామాజిక సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. ఈ వర్క్‌షాప్‌కు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కయల్విలి(హెడ్‌క్వార్టర్స్) డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసన్ (పరిపాలన), ఎస్‌ఎస్ మహేశ్వరన్ (ఆధునిక కంట్రోల్ రూమ్) హాజరయ్యారు. గ్రేటర్ చైన్నె పోలీస్‌కి చెందిన 217 మంది ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.