ఇంద క్రైమ్‌ తప్పిల్లై చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంద క్రైమ్‌ తప్పిల్లై చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Sep 22 2023 1:32 AM | Updated on Sep 22 2023 1:32 AM

పోస్టర్‌  విడుదల చేస్తున్న యూనిట్‌ సభ్యులు
 - Sakshi

పోస్టర్‌ విడుదల చేస్తున్న యూనిట్‌ సభ్యులు

తమిళ సినిమా: మధురియా ప్రొడక్షన్స్‌ పతాకంపై మనోజ్‌ కృష్ణస్వామి నిర్మిస్తున్న చిత్రం ఇంద క్రైమ్‌ తప్పిల్లై దేవకుమార్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో ఆడుగళం నరేన్‌, బుల్లితెర నటుడు పాండి కమల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నటి మేఘ్నా ఎలన్‌ కథానాయకిగా నటిస్తున్నారు. నటుడు వెంకట్రావు మూర్తి కాలనీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఎంఎం కార్తికేయన్‌ ఛాయాగ్రహణం, పరిమళవాసన్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంద క్రైమ్‌ తప్పిల్లై అంటే ఈ నేరం తప్పుకాదని అర్థం టైటిల్‌ చూస్తుంటే ఇదేదో క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందనిపిస్తోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదలై చిరుతైగళ్‌ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు తొళ్‌ తిరుమావళవన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు చిత్రవర్గాలు మీడియాకు విడుదల చేస్తున్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కథను మాత్రమే నమ్మి రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement