అన్నానగర్: చైన్నెలో వేర్వేరు చోట్ల గురువారం ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చైన్నె రాయపేటకు చెందిన ప్రతాప్‌కుమార్ (40). ఇతని భార్య కాంచన. ఈమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రతాప్‌కుమార్ గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతం పాలెం పుష్పవతి అమ్మన్ కోయిల్ వీధికి చెందిన దిలిప్ (34) కారు డ్రైవర్. ఇతని భార్య రీతూ. రీతూకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో దిలీప్ మాత్రమే పనికి వెళ్తున్నాడు. కుటుంబపోషణ భారం కావడంతో బుధవారం రాత్రి మద్యం తాగి దిలీప్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కన్నగినగర్‌కు చెందిన మీనా (36). మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తురైపాక్కం ప్రాంతానికి చెందిన షణ్ముకప్రియాన్ (24) కుటుంబ కలహాలతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వడపళనికి చెందిన అరుల్‌రాజ్ (48) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేలాచ్చేరి నెహ్రూనగర్ జీవానందం వీధికి చెందిన తవరగణేష్ (31). మద్యానికి బానిసైన గణేష్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.