పోలీస్‌పై దాడి.. ఇద్దరి అరెస్టు

తిరువొత్తియూరు: వాహన తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుపై దాడి చేసిన అన్నాదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొడుంగూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ప్రకాష్‌, పార్థసారథి తదితరులు సోమవారం రాత్రి కొడుంగయూర్‌ మీనంబాల్‌ రోడ్డులో వాహన తనిఖీలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. కారులో వచ్చిన ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. గాయపడిన ప్రకాష్‌ను పెరియార్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కొడుంగయూరు ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసి దాడి చేసిన అభిరామి అవెన్యూ పద్మావతినగర్‌కు చెందిన శరవణన్‌ (29), విఘ్నేశ్వరన్‌ (29)లను అరెస్టు చేశారు. వీరిద్దరూ అన్నాదమ్ములని గుర్తించారు. కుంభకోణంకు చెందిన వీరు చైన్నె కొడుంగయూరులో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. నిందితుల కారును స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచారు. పుళల్‌ జైలుకు తరలించారు.

సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో

12 కిలోల గంజాయి స్వాధీనం

– ఒడిశా యువకుడి అరెస్టు

తిరువొత్తియూరు: చైన్నె సెంట్రల్‌ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో 12 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఒడిశాకు చెందిన దీపక్‌సాగు (36)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మంగళవారం ఉదయం కోర మాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో చైన్నెకి వచ్చాడు. సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో దిగి బయటకు వెళ్తున్న సమయంలో ఇతనిపై పోలీసులకు సందేహం కలి గింది. దీంతో డీఎస్పీ ముత్తుకుమార్‌ నేతృత్వంలో పోలీసులు అతని వద్ద తనిఖీ చేయగా రెండు పార్సి ళ్లు లభ్యమయ్యాయి. ఒకొక్క పార్సిల్‌లో 6 కిలోల గంజా యి వంతున మొత్తం 12 కిలోలు ఉన్నట్లు తెలిసింది. దీంతో దీపక్‌సాగును అరెస్టు చేసి కోర్టు లో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

వ్యాసార్పాడిలో

ఏడు ఆటోలు ధ్వంసం

– దుండగుల కోసం పోలీసుల గాలింపు

తిరువొత్తియూరు: చైన్నె వ్యాసార్పాడిలో ఏడు ఆటోలను ధ్వంసం చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. వ్యాసార్పాడి ఒకటో బ్లాకు వీధిలో పెద్దసంఖ్యలో ఆటోలు నిలుపుతున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఆటోలో నిలిపి ఉన్న చోట నుంచి భారీగా శబ్ధాలు వినిపించాయి. దీంతో ఇళ్లలోని ఉన్న వారు బయటకు వచ్చి చూడగా కొందరు వ్యక్తులు ఆటోలను ధ్వంసం చేస్తూ కనిపించారు. స్థానికులు చూసిన వెంటనే దుండగులు పారిపోయారు. అక్కడ నిలిపి వున్న వాటిలో ఏడు ఆటోలు ధ్వంసం అయినట్లు గుర్తించి వ్యాసార్పాడి ఇన్‌స్పెక్టర్‌ గుణశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసి ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల కోసం గాలిస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న లారీ

–ముగ్గురి దుర్మరణం

అన్నానగర్‌: బైక్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన తిరుమంగళం వద్ద మంగళవారం ఉదయం జరిగింది. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని ఉత్పరైయూర్‌లో ఆలయ ఉత్సవం జరుగుతోంది. దేవనాయకపురానికి చెందిన తంగం (56), చైన్నెకు చెందిన మాయంతి (60), కన్నన్‌ (30) పండుగకు వచ్చారు. మంగళవారం ఉదయం తంగం, మాయంతి, కన్నన్‌ పూజా సామగ్రి కొనుగోలు చేయడానికి పేరయూర్‌ వైపు వస్తుండగా వీరి బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థాని కులు పేరయూరు పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉసిలంపట్టి ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top