వేలూరు: వేలూరు కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారిగా ఆర్తీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్తీ 2017 నుంచి 2022 సంవత్సరం వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ధర్మపురి ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు వేలూరులోని ప్రాజెక్టు అధికారి ఉంటున్న సత్‌వచ్చారి వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు. ఇంటి తలుపులు మూసి వేసి ఇంటిలోని వ్యక్తులు బయటకు రాకుండా బయట వ్యక్తులు లోపలకు వెళ్లకుండా సెల్‌పోన్లు, పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదంగా
ఇద్దరు వృద్ధురాళ్లు మృతి
అన్నానగర్: విల్లుపురంలో సోమవారం రాత్రి ఇద్దరు వృద్ధురాళ్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విల్లుపురం రైల్వేస్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాంపై 70 ఏళ్ల వృద్ధురాలు సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతిచెందింది. సమాచారం అందుకున్న విల్లుపురం రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా విల్లుపురం కొత్త బస్టాండ్ వద్ద 60 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సమాచారం అందుకున్న విల్లుపురం తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.