నేడు ఏడు మండలాల్ల్లో సెలవు
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బుధవారం మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో స్థానిక సెలవుగా ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్‌లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెర్వు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలో పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
పటిష్ట పోలీస్ బందో బస్తు
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హుజూర్‌నగర్, కోదాడ సీఐలు చరమందరాజు, ప్రతాపలింగం తెలిపారు. రెండు సర్కిళ్ల పరిధిలోని ఏడు మండలాలకు ఎన్నికల విధుల కోసం ఇద్దరు అడిషినల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, సుమారు 800మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి విధులు నిర్వహించనున్నట్లు వివరించారు.
కేసుల పరిష్కారానికి
కృషి చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు న్యాయవాదులు పాల్గొన్నారు,.
కోర్టు భవన నిర్మాణానికి కృషి చేయాలని వినతి
చివ్వెంల(సూర్యాపేట): మాజీ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం సూర్యాపేట పట్టణానికి చెందిన న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వం కొత్త కోర్టు కోసం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, న్యాయవాదులు తల్లమళ్ల హస్సెన్, నల్ల గుంట్ల అయోధ్య, నంద్యాల దయాకర్ రెడ్డి, మోదుగు వెంకట్ రెడ్డి, మీలా రమేష్, గోండ్రాల అశోక్, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
నేడు ఏడు మండలాల్ల్లో సెలవు
నేడు ఏడు మండలాల్ల్లో సెలవు


