వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ సూచించారు. సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాలోని ప్రిన్సిపల్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 రోజుల కార్యక్రమాన్ని నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలల్లో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఐఈఓ బాలునాయక్, కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లుల విడుదలకు పోరాటం
సూర్యాపేటటౌన్ : రాష్టంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల విడుదలకు పోరాటం నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను రద్దు చేసేందుకు న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దండుగుల ఎల్లయ్యలను సన్మానించారు. కార్యక్రమంలో తీగల నరేష్, కొల్లు మధుసూదన్ రావు, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కాలం నారాయణ్ రెడ్డి, మేకల జానారెడ్డి, రవీందర్ రెడ్డి, బొల్లు రాంబాబు, కృపాకర్ రెడ్డి, బొల్లికొండ కోటయ్య, పప్పుల వీరబాబు, రామలింగా రెడ్డి పాల్గొన్నారు.
వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి


