274 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం
ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో సమావేశం
సూర్యాపేట : జిల్లాలో 40వేల ఎకరాల్లో వరి కోతలు జరిగాయని, దాదాపు 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావులు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో తుపాన్ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పి ఉంచేలా అవగాహన కల్పించామని, రెండు రోజులపాటు వరి కోతలు చేయవద్దని విజ్ఞప్తి చేశామని తెలిపారు.
ఫోటోఫైల్ నెం : 27ఎస్‌పిటి 87
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూర్యాపేట జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్షం నేపథ్యంలో ధాన్యం తడవకుండా చూసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్‌ఓ మోహన్ బాబు, సివిల్ సప్లయ్ మేనేజర్ రాము, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, డీసీ ఓ పద్మ, ఏపీడీ సురేష్, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ బెనర్జీ, ఏఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


