ప్రభుత్వం గీతన్న బంధు ప్రకటించాలి
తుంగతుర్తి : గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం గీతన్న బంధు ప్రకటించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవిందు కోరారు. సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య ఆధ్వర్యంలో సంఘం జిల్లా నాలుగవ మహాసభను గోవిందు ప్రారంభించి మాట్లాడారు. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలన్నారు. రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని డిమాండ్ చేశారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, ఉన్న 560 జీఓను అమలు చేయాలని కోరారు. సొసైటీలు ఏర్పాటు చేసుకున్న వారందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, నూతనకల్, మద్దిరాల మండలాల అధ్యక్షులు తణుకు సైదులు గౌడ్, ఆకుల రమేష్, తుంగతుర్తి మండల ప్రధాన కార్యదర్శి చిర్ర నరేష్, గౌడ సంఘం నాయకులు తునికి సాయిలు, బుర్ర శ్రీనివాస్, గుండగాని అంజయ్య, గడ్డం ఉప్పలయ్య, సూదగాని రాజయ్య, మారగాని వెంకటయ్య పాల్గొన్నారు.


