మెళకువలు పాటిస్తే విజయం
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్) కింద ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. ఇందుకుగాను ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనుంది. ఇందులో ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో నాలుగు సంవత్సరాలపాటు ప్రతి ఏడాది రూ.12వేల చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈమేరకు సూర్యాపేట జిల్లాలో 73 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు కందిబండ రామారావు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌పై విద్యార్థులకు ఆరేళ్లుగా ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. పరీక్షలో ఎంపిక కావడానికి ఎలా సన్నద్ధం కావాలో సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే
180 మార్కులకు పరీక్ష
మెంటల్ ఎబిలిటీ , స్కొలాస్టిక్ యాటిట్యూడ్ సిలబస్ ఉంటుంది. పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రధానంగా నంబర్ సీరీస్, ఆల్ఫాబెటికల్ సీరీస్, వర్గీకరణ, పదాల సామర్థ్యం, కోడింగ్– డీ కోడింగ్, మిస్సింగ్ క్యారెక్టర్, సంఖ్యా సామర్థ్యం, సమీకరణాలను తుల్య ం చేయడం లాంటి పుస్తకాలను చదవాలి. 7, 8వ తరగతికి సంబంధించి సామాన్య, సాంఘిక శాస్త్రం, గణితం, ఎస్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు చదవాలి.
బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష
బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష పేపర్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కావడంతో సమయం కూడా ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. అడిగిన సమాధానాలు షార్ట్‌కట్‌లో సాధించే విధంగా ప్రిపేర్ కావాలి.
ఉచితంగా శిక్షణ
ఫ ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌లో ప్రతిభ కనబరచాలంటే సబ్జెక్టుల వారీగా దృష్టి సారించాలి
ఫ పరీక్షా విధానంపై చిలుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడి సూచనలు


