రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు(అండర్–19) శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడా రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపు పెంచాలని అన్నారు. క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అననారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ రమణి, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పీడీ ఎన్. ప్రసాద్, వాలీబాల్ క్రీడల రాష్ట్ర పర్యవేక్షకుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బాలరాజు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
ఫ వివిధ జిల్లాల నుంచి
హాజరైన క్రీడాకారులు
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం


