
భక్తి శ్రద్ధలతో శ్రీగిరి రఽథోత్సవం
పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగుతూ ఊరేగింపుగా విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్ కూడలి, చింతతోపు, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పార్టీ అనుబంధ విభాగంలో చోటు
ధర్మవరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన చందమూరి నారాయణరెడ్డి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టాలపై యువకుడి
మృతదేహం
ధర్మవరం రూరల్:
మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గురువారం ఉదయం 7 గంటలకు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లేత నీలం రంగు టీ షర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించిన 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడి మృతదేహం ఎడమ చేతిపై నేహ అనే పచ్చబొట్టును గుర్తించారు. అంతకు మించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 99513 25345లో సంప్రదించాలని ధర్మవరం రైల్వే పోలీసులు కోరారు.

భక్తి శ్రద్ధలతో శ్రీగిరి రఽథోత్సవం

భక్తి శ్రద్ధలతో శ్రీగిరి రఽథోత్సవం