The Great Khali: బీజేపీలో చేరిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్

Wrestler The Great Khali Joins BJP - Sakshi

The Great Khali Joins BJP: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్‌ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్‌ దలీప్‌ సింగ్‌ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో జరగనున్న పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఖలీ బీజేపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారవచ్చని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. 


కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన ఖలీ.. పోలీస్‌ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా పంజాబ్‌కు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు. అక్కడ ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ప్రోద్భలం మేరకు రెజ్లర్‌గా మారిన అతను వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ)లో ఉన్నత శిఖరాలకు చేరాడు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ హోదా నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎదిగాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఖలీ, భారత్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ సైన్‌ చేసిన మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. 

7 అడుగులకు పైగా పొడవు, భారీ శరీరం కలిగిన ఖలీ, బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. అలాగే హిందీ రియాల్టీ షో బిగ్ బాష్ సీజన్ 4లో రన్నరప్‌గా నిలిచాడు. ఖలీకి ఈ తెర ఆ తెర అన్న తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) తరఫున ఎన్నికల ప్రచారం చేసిన ఖలీ, అదే పార్టీలో చేరతాడని అంతా ఊహించారు. అయితే, ఈ  అజానుబాహుడు అందరికీ షాకిస్తూ.. ఇవాళ కమల తీర్ధం పుచ్చుకున్నాడు. 
చదవండి: రిష‌బ్‌ పంత్‌ను వ‌రించిన ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top