Wimbledon 2022: రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్లకు షాక్‌.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం!

Wimbledon 2022: Daniil Medvedev Other Russian Players May-Ban Tournament - Sakshi

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా వైఖరిని నిరసిస్తూ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ నిర్వహించే ఆల్‌ ఆంగ్లండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌(AELTC) రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్లకు షాక్‌ ఇవ్వనుంది. జూన్‌ 27-జూలై 10 మధ్య జరగనున్న వింబుల్డ్‌న్‌కు రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లను దూరంగా ఉంచాలని బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఏఈఎల్‌టీసీ నివేధించింది. ఈ మేరకు పురుషుల విభాగంలో వరల్డ్‌ నెంబర్‌-2.. డానిల్‌ మెద్వెదెవ్‌తో పాటు ఎనిమిదో ర్యాంకర్‌ ఆండ్రీ రుబ్లేవ్‌ దూరం కానుండగా.. మహిళల విభాగంలో 15వ ర్యాంకర్‌ అనస్తాసియా పావ్లియుచెంకోవా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్‌కు ప్రధాన కారణమైన బెలారస్‌ను కూడా వింబుల్డన్‌ నుంచి బహిష్కరించే అవకశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్‌ కమిటీ కూడా రష్యన్‌ ప్లేయర్లు పాల్గొంటున్న టోర్నీల్లో దేశం తరపున ఆడకూడదనే కండిషన్‌ పెట్టింది. తాజాగా బ్రిటీష్‌ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా ఉన్న నిగెల్‌ హడిల్‌స్టన్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఒకవేళ రష్యన్‌ ఆటగాళ్లు వింబుల్డన్‌లో పాల్గొనాలనుకుంటే.. రష్యన్‌ జెండాతో కాకుండా మాములుగా బరిలోకి దిగితే అనుమతిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: Maria Sharapova Pregnancy: తల్లికాబోతున్న ‘టెన్నిస్‌ స్టార్‌’.. సోషల్‌ మీడియాలో పోస్టుతో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top