Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి...

Virat Kohli Reveals Why he Decided to Step Down as RCB Captain After IPL 2021 - Sakshi

Virat Kohli Reveals Why he Decided to Step Down as RCB Captain  ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులను విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కెప్టెన్‌గా ఎందుకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడో కోహ్లి తాజాగా వెల్లడించాడు. నేడు( సోమవారం) కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుం‍ది. ఈ క్రమంలో అత‌డు, డివిలియర్స్‌తో కలిసి స్టార్‌ స్పోర్ట్స్‌ వ‌ర్చువ‌ల్ ఇంటర్వూలో పాల్గొన్నాడు. తన నిర్ణయం వెనుక పనిభారం అతిపెద్ద కారణమని కోహ్లి పేర్కొన్నాడు. ఇక బాధ్య‌త‌ల విష‌యంలో తాను నిజాయ‌తీ లేకుండా వ్య‌వ‌హ‌రించ‌లేని విరాట్‌ తెలిపాడు.

'కెప్టెన్‌గా తప్పుకోవడానకి పనిభారం ప్రధాన కారణం. నా బాధ్యత పట్ల నేను నిజాయితీ లేకుండా వ్య‌వ‌హ‌రించ‌లేను.  నేను దేనినైనా వందకు 120% ఇవ్వలేకపోతే, దానిని  పట్టుకొని వేలాడే  వ్యక్తిని కాను. ఈ విషయంలో నేను క్లియర్‌గా ఉంటాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతున్నప్పుడు కోహ్లి చెప్పాడు. కాగా 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోహ్లి ఆర్సీబీకి టైటిల్‌ అందించడంలో విఫలమయ్యాడు. ఇక టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ ఇంతవరకు బెంగళూరు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్‌ సాధించి కెప్టెన్‌గా కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.

చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్‌ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top