
T20 World Cup 2022: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2022కు యూఏఈ, ఐర్లాండ్ జట్లు అర్హత సాధించాయి. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ సెమీస్‌లో ఓమన్‌ను ఓడించి ఐర్లాండ్, నేపాల్‌ను ఓడించి యూఏఈ ప్రపంచకప్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. క్వాలిఫయర్స్ సెమీస్-2లో ఐర్లాండ్.. ఓమన్‌పై 56 పరుగుల తేడాతో విజయం సాధించగా, తొలి సెమీస్‌లో యూఏఈ నేపాల్‌ను 68 పరుగుల తేడాతో మట్టకరిపించి ఫైనల్‌కు చేరాయి.
ఫలితంగా యూఏఈ, ఐర్లాండ్ జట్లు వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజ్‌లో నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో తలపడతాయి. వరల్డ్‌కప్ గ్రూప్ దశలో ఈ ఆరు జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అనంతరం రెండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో సూపర్ 12 రౌండ్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.
చదవండి: లంకతో సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఉలిక్కిపడ్డ సీఎస్‌కే