Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై!

ఆసియాకప్-2022లో భారత్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా ఈ మ్యాచ్ భారత బ్యాటర్లు పర్వాలేదనిపించనప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) అర్ధసెంచరీతో చేలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఫైనల్ బెర్త్‌ను శ్రీలంక దాదాపు ఖారారు చేసుకుంది. అయితే లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్ము రేపిన భారత్.. కీలకమైన సూపర్-4 దశలో వరుసుగా ఓటముల చవి చూడటం పట్ల అభిమానలు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
#AsiaCupT20 to #india, khatam tata byebye goodbye gyaa #INDvsSL
— Abdullah zaka (@Abdullahzaka10) September 6, 2022
సోషల్ మీడియా వేదికగా భారత జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి' అంటూ ఓ ట్విటర్ యూజర్ పోస్టు చేశాడు. కాగా భారత్ ఫైనల్ చేరాలంటే కొన్ని అద్భుతాలు జరిగాలి. సూపర్-4లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాలి.
Indian fans waiting for indian team at Mumbai airport:#INDvsSL #AsiaCupT20 #AsiaCup2022#Goodbye pic.twitter.com/ojuEJ1OyRp
— Ahtasham Riaz (@AhtashamRiaz22) September 6, 2022
అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత్, పాక్, ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది.
Bhuvi:
Yesterday he gave away 19 run in the 19th over and today 14 ..#INDvSL pic.twitter.com/YQYNo6j0zh
— Hiesnberg (@MALAYMU96793905) September 6, 2022
చదవండి: పాక్ పేసర్ నసీమ్ షాతో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు