టోక్యో: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ | Tokyo Olympics: India Men Relay Team New Record But Failed Qualify Final | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ

Aug 7 2021 7:33 AM | Updated on Aug 7 2021 8:50 AM

Tokyo Olympics: India Men Relay Team New Record But Failed Qualify Final - Sakshi

పురుషుల రిలే జట్టు(ఫొటో: ఐఓఏ)

టోక్యో ఒలింపిక్స్‌: భారత రిలే టీం సరికొత్త రికార్డు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో భారత పురుషుల రిలే జట్టు 4X400 మీటర్ల విభాగంలో కొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది. అనస్‌ యాహియా, టామ్‌ నోవా నిర్మల్, రాజీవ్‌ అరోకియా, అమోజ్‌ జాకబ్‌లతో కూడిన భారత రిలే జట్టు రెండో హీట్‌లో 3ని:00.25 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ క్రమంలో 3ని:00.56 సెకన్లతో ఖతర్‌ జట్టు పేరిట ఉన్న ఆసియా రికార్డును భారత బృందం సవరించింది. అయితే భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత వాకర్స్‌ ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో... భావన జాట్‌ 32వ స్థానంలో నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement