T20 World Cup: ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్‌"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి

T20 World Cup: BCCI Requests UAE Authorities To Have Full Capacity Spectators For Final Match - Sakshi

BCCI Requests To Have Full Capacity Spectators For T20 World Cup Final Match: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా న‌వంబ‌ర్ 14న జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్‌ మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యం( 25 వేలు) మేరకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐతో పాటు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)లు యూఏఈ ప్రభుత్వాన్ని కోరాయి. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆతిధ్య దేశం అనుమతి తప్పనసరి కావడంతో బీసీసీఐ, ఈసీబీలు ఎమిరేట్స్‌ ప్రభుత్వానికి  ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. కరోనా కారణంగా మెగా టోర్నీ నిర్వహణ భారత్‌ నుంచి యూఏఈకి త‌ర‌లిపోయినప్పటికీ.. ఆతిథ్య హ‌క్కులు మాత్రం బీసీసీఐతోనే ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం యూఏఈలో జ‌రుగుతున్న ఐపీఎల్‌కు అభిమానుల‌ను అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధ‌న‌ల మ‌ధ్య ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే ప్రేక్షకులను అనుమ‌తిస్తున్నారు. స్టేడియానికి వ‌చ్చే ప్రేక్షకులు త‌ప్ప‌నిస‌రిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాల‌న్న నిబంధ‌నతో పాటు 48 గంట‌ల‌ వ్యవధిలో చేయించుకున్న నెగ‌టివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. కాగా, అక్టోబ‌ర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌ మహా సంగ్రామం మొదలుకానుంది. ఆ మరుసటి రోజు( అక్టోబ‌ర్ 24న) దాయాదుల(భారత్‌, పాక్‌) మధ్య రసవత్తర పోరు జరుగనుంది.  
చదవండి: టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top