
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న (సెప్టెంబర్ 8) రాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ROHIT SHARMA AT THE KOKILABEN HOSPITAL IN MUMBAI. (Pallav Paliwal).
pic.twitter.com/sT42YFD5Ak— Tanuj (@ImTanujSingh) September 8, 2025
కొందరేమో రోహిత్‌కు బాగలేదని అంటుంటే, మరికొందరేమో ఆసుపత్రిలో ఉన్న సన్నిహితులను పరామర్శించేందుకు వెళ్లాడని అంటున్నారు. మొత్తంగా ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్‌మీడియాలో నిరాధార ప్రచారం జరుగుతుంది.
అయితే రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో వ్యవహరించిన తీరు మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ సరదాగా కనిపించే హిట్‌మ్యాన్ ఎందుకో కాస్త భిన్నంగా కనిపించాడు. మీడియా ప్రశ్నలకు స్పందించకుండా హడావుడిగా ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాడు. రోహిత్‌వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు జర్నలిస్ట్‌లకు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు.
రోహిత్ అసౌకర్యంగా (శారీకంగా) కనిపించకపోయినా రాత్రి వేళ అసుపత్రికి వెళ్లడం ఊహాగానాలకు తావిస్తుంది. రోహిత్ ఇటీవలే బీసీసీఐ ఆథ్వర్యంలో నిర్వహించిన Yo-Yo టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. రోహిత్ ఆసుపత్రి సందర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
38 ఏళ్ల రోహిత్ ఇటీవలే టెస్టులు, గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఫిట్‌నెస్‌ను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
రోహిత్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. రోహిత్ లాగే టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి కూడా ఆస్ట్రేలియా సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరి రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.