
ముంబై: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు వేసుకోబోయే స్వెటర్ (జంపర్)ను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రదర్శించాడు. దీనిని వేసుకున్న అతను ‘రివైండ్ టు నైన్‌టీస్’ అనే వ్యాఖ్యను జోడించాడు. కొన్నాళ్ల క్రితమే వన్డే, టి20ల్లో పాత కాలపు రెట్రో జెర్సీలను గుర్తుకు తెచ్చేలా అలాంటి దుస్తులనే ధరించిన టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు టెస్టుల కోసం అదే తరహా లుక్‌ను చూపిస్తున్నారు.
90వ దశకంలో భారత ఆటగాళ్ల స్వెటర్ తరహాలోనే దీనిలో మెడ చుట్టూ రెండు పెద్ద చారలు ఉన్నాయి. ప్రస్తుత టీమ్ వాడుతున్న స్వెటర్‌లపై ఇలాంటి గీతలు లేవు. ఐసీసీ నిబంధనల ప్రకారం ముందు భాగంలో స్పాన్సర్ పేరు లేకుండా కేవలం ఇండియా అని మాత్రమే రాసి ఉంది.