BWF World Tour Finals 2021: PV Sindhu Beats Japan Akane Yamaguchi to Enter Into the Final - Sakshi
Sakshi News home page

PV Sindhu: అదరగొట్టిన సింధు.. యమగూచిని ఓడించి ఫైనల్లో అడుగు

Dec 4 2021 4:40 PM | Updated on Dec 4 2021 5:04 PM

PV Sindhu Beats Japan Akane Yamaguchi Enter Finals BWF World Tour Finals - Sakshi

BWF World Tour Finals 2021: Sindhu Beats Yamaguchi to Enter Into the Final: సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌లో భాగంగా భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. మహిళల సింగిల్స్‌ గ్రూపు ఏలో సెమీ ఫైనల్‌ చేరిన ఆమె.. అకానె యమగూచి(జపాన్‌)ని ఓడించింది. తద్వారా ఫైనల్‌లో అడుగుపెట్టింది. డెబ్బై నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-15, 15-21, 21-19 తేడాతో యమగూచిపై విజయం సాధించింది. 

కాగా ఫైనల్‌లో సింధు... దక్షిణ కొరియా ప్లేయర్‌ సెయంగ్‌తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో మరో భారత ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ గ్రూప్‌-బి చివరి మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీ ఫైనల్‌ కూడా చేరకుండానే నిష్క్రమించాడు. కాగా ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలిపింక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు విశ్వ క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌ గెలిచిన ఈ వెండికొండ...  ఏకంగా రెండు ఒలిపింక్‌ పతకాలు తన ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement