PSL 2023: 41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు

PSL: Rilee Rossouw Smash-121 Runs-51 Balls-Multan Sultan Enters Play-Off - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో సంచలనాలు నమోదవుతన్నాయి. మ్యాచ్‌ స్కోర్లు 250 దరిదాపుల్లో నమోదవుతున్నా చేజింగ్‌ జట్లు అవలీలగా టార్గెట్‌నే చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జాల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌ అందుకు ఉదాహరణ.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. సయామ్‌ అయుబ్‌ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక మహ్మద్‌ హారిస్‌(11 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సర్లతో 35 పరుగులు), కొహ్లెర్‌ కాడ్‌మెర్‌(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు నమోదైంది.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత వచ్చిన రిలీ రొసౌ(51 బంతుల్లోనే 121 పరుగులు, 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. కీరన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 52, 3ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ముల్తాన్‌ సుల్తాన్స్‌ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది.

అయితే చివర్లో ఇద్దరు స్వల్ప తేడాతో ఔటైనప్పటికి అన్వర్‌ అలీ(8 బంతుల్లో 24 నాటౌట్‌), ఉస్మా మీర్‌(3 బంతుల్లో 11 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా పీఎస్‌ఎల్‌ చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ విజయంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది.

చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్‌ భరత్‌కు కోహ్లి ఆదేశం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top