IPL 2022: ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇది: పంత్

IPL 2022 DC Vs SRH: ఐపీఎల్-2022లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ కేవలం 54 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇప్పటి వరకు తను చూసిన ఢిల్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో వార్నర్ ఇన్నింగ్స్ ఒకటని అతడు కొనియాడాడు. "ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదే విధంగా అతడు ఇన్నింగ్స్ సాగించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటి వరకు ఢిల్లీ జట్టులో చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటి.
ఇక పావెల్ మా జట్టుకు ఏమి చేయగలడో మాకు తెలుసు. తొలి మ్యాచ్‌లలో విఫలమైనా అతడికి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించడం మాపై ఒత్తిడిని తగ్గించింది" అని పంత్ పేర్కొన్నాడు. కాగా హైదరాబాద్‌పై విజయంతో 10 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరింది.
ఐపీఎల్ మ్యాచ్ 50: ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు
ఢిల్లీ- 207/3 (20)
ఎస్‌ఆర్‌హెచ్- 186/8 (20)
చదవండి: IPL 2022: ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు.. కేన్ మామతో సెల్ఫీ దిగిన వార్నర్
5⃣th win for @RishabhPant17 & Co. in the #TATAIPL 2022! 👏 👏
The @DelhiCapitals beat #SRH by 21 runs & return to winning ways. 👌 👌 #DCvSRH
Scorecard ▶️ https://t.co/0T96z8GzHj pic.twitter.com/uqHvqJPu2v
— IndianPremierLeague (@IPL) May 5, 2022
మరిన్ని వార్తలు