జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్ | Milind Soman Conquers the Strait of Gibraltar | Sakshi
Sakshi News home page

జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్

May 5 2026 6:16 PM | Updated on May 5 2026 6:16 PM

Milind Soman Conquers the Strait of Gibraltar

వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.

మే 1న యూరప్‌లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు.  క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. 

కాగా  మిలింద్ సోమన్ ఫిట్‌నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్‌. సోమన్ తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు.  గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.

ఇక సోమన్‌ 1990లలో సూపర్‌ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్‌గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్‌ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్,, డిసెంబర్‌ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు  సిరీస్‌లలో తన నటనతో మొప్పించారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement