Marnus Labuschagne: కాఫీ బ్యాగులతో భారత్‌కు ఆసీస్‌ క్రికెటర్‌; తాగడానికా.. అమ్మడానికా?

Marnus Labuschagne-Full Bag Of-Coffee Seeds Enters India-Cricketers Reply - Sakshi

టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌ భారత్‌కు కాఫీ ప్యాకెట్లను తీసుకొచ్చాడు. ఒక బ్యాగు నిండా కాఫీ ప్యాకెట్లు ఉండడం చూసి ఎయిర్‌పోర్టు అధికారులు కూడా షాక్‌ అయ్యారట. వాస్తవానికి లబుషేన్‌కు కాఫీ అంటే విపరీతంగా ఇష్టమట. రోజుకు పది కప్పులకు పైగా కాఫీ తాగుతాడంట. ఈ విషయాన్ని లబుషేన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లబుషేన్‌ పోస్టును చూసిన పలువురు క్రికెటర్లు ఆసక్తిరంగా స్పందించారు. డేవిడ్‌ వార్నర్‌ స్పందిస్తూ.. కాఫీ ప్యాకెట్లకు దిగుమతి సుంకం చెల్లిస్తున్నావా?.. అయినా అన్ని కాఫీ బ్యాగులెందుకు.. తాగడానికా లేక అమ్మడానికా..'' అంటూఅని ప్రశ్నించాడు. ఇ‍క మరో క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌.. ''అక్కడి నుంచి కాఫీ బ్యాగులెందుకు.. భారత్‌లో కూడా మీకు మంచి కాఫీ దొరుకుతుంది.'' అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు.

చదవండి: సచిన్‌ చేతుల మీదుగా సన్మానం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top