'అమ్మ జడ్డూ.. ఒకేసారి రెండు వికెట్లు తీసిన మొనగాడు!' | Livingstone-Out-Of-Crease Jadeja Acts Play-Droping Ball Taking Bails-Off | Sakshi
Sakshi News home page

#RavindraJadeja: 'అమ్మ జడ్డూ.. ఒకేసారి రెండు వికెట్లు తీసిన మొనగాడు!'

Apr 30 2023 6:44 PM | Updated on Apr 30 2023 7:51 PM

Livingstone-Out-Of-Crease Jadeja Acts Play-Droping Ball Taking Bails-Off - Sakshi

Phtot: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో గత మ్యాచ్‌ హీరో అథర్వ తైదేను జడేజా తెలివిగా బుట్టులో వేసుకున్నాడు. షార్ట్‌లెంగ్త్‌ బంతులు ఆడడం అథర్వ బలహీనత అని తెలుసుకున్న జడేజా అదే బంతి వేశాడు. దీంతో అథర్వ షాట్‌ ఆడే ప్రయత్నంలో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇంతవరకు బాగానే ఉంది. 

నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్‌ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన జడ్డూ అప్పటికే క్యాచ్‌గా తీసుకున్న బంతిని డ్రాప్‌ చేసినట్లుగా చేసి ఆ తర్వాత బంతిని తీసుకొని వికెట్లను ఎగురగొట్టాడు. అయితే ఇదంతా ఫన్నీవేలోనే కావడం విశేషం. జడ్డూ చర్యతో లివింగ్‌స్టోన్‌ సహా సీఎస్‌కే ఆటగాళ్లు నవ్వుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. '' అమ్మ జడ్డూ స్రైకింగ్‌, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ వికెట్లు ఒకేసారి తీద్దామనుకున్నావా.. జడ్డూ తెలివి మాములుగా లేదు.. ఒకటేసారి రెండు వికెట్లు తీయాలనుకున్నాడు..'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: అక్కడ ధోని.. కాన్వేను ఎవరు పట్టించుకుంటారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement