KKR Star Suyash Sharma Dramatic Tale Of Selection Snub: Cried, Came Home And Shaved My Head - Sakshi
Sakshi News home page

#Suyash Sharma: నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా! ఏదో ఒకరోజు కచ్చితంగా..

May 12 2023 3:01 PM | Updated on May 12 2023 3:32 PM

KKR Star Dramatic Tale Of Selection Snub: Cried Came Home Shaved My Head - Sakshi

కేకేఆర్‌ (PC: IPL/KKR)

అండర్‌-19 ట్రయల్స్‌లో సెలక్ల్‌ కాలేదని గుండు చేసుకున్న సూయశ్‌ శర్మ

IPL 2023- KKR Star Suyash Sharma: ‘‘గతేడాది నేను అండర్‌-19 ట్రయల్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాను. కానీ సెలక్ట్‌ కాలేకపోయాను. ట్రయల్స్‌లో ఎంపికైన వాళ్ల జాబితాను మధ్యరాత్రి 12. 30- ఒంటి గంట మధ్య విడుదల చేశారు. కానీ అప్పటికే నేను నిద్రపోయాను.

తెల్లవారి మూడు గంటలకు నిద్రలేచిన తర్వాత లిస్టు చూశాను. ఆ తర్వాత రెండు గంటల పాటు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను’’ అంటూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యువ స్పిన్నర్‌ సూయశ్‌ శర్మ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు.

రూ. 20 లక్షలతో
న్యూఢిల్లీలో జన్మించిన.. పందొమిదేళ్ల సూయశ్‌ శర్మ దేశవాళీ క్రికెట్‌లో ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. ఢిల్లీ అండర్‌-25 పురుషుల స్టేట్‌-ఏ ట్రోఫీ టోర్నీలో మాత్రమే ఆడాడు. ఈ ఈవెంట్‌లో మొత్తంగా 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లే పడగొట్టిన సూయశ్‌ ఐపీఎల్‌-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.

అరంగేట్రంలోనే అదుర్స్‌
కనీస ధర రూ. 20 లక్షలకు అతడిని కొనుగోలు చేసిన కేకేఆర్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ మణికట్టు స్పిన్నర్‌ 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా దింపినందుకు మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుని పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడు. ఆర్సీబీపై విజయంలో తన వంత పాత్ర పోషించి క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. 

గుండు చేసుకున్నా
ఇక ఇప్పటి వరకు ఐపీఎల్‌-2023లో 9 మ్యాచ్‌లు ఆడిన సూయశ్‌ 10 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. బ్లాక్‌ హెడ్‌బ్యాండ్‌తో కనిపించే యువ స్పిన్నర్‌ ఎంత ప్రయత్నించినా అండర్‌-19 ట్రయల్స్‌లో సెలక్ట్‌ కాలేకపోయానంటూ తాజా ఐపీఎల్‌ ఇంటర్వ్యూలో తన ఆవేదన పంచుకున్నాడు.

‘‘వాళ్లు నన్ను బౌలింగ్‌ చేయమని చెప్పారు. కానీ నేను అక్కడకు వెళ్లగానే నన్ను అసలు పట్టించుకోలేదు. సెలక్ట్‌ చేయలేదు. నేను ఏడుస్తూ ఇంటికొచ్చాను. వెంటనే నా తల మొత్తం షేవ్‌ చేసుకున్నా(గుండు చేసుకున్నా). ఎంతో ఆశగా వెళ్లిన నేను తీవ్ర నిరాశకు లోనయ్యాను.

నాకే ఎందుకిలా?
ఎంత ప్రయత్నించినా నాకే ఎందుకిలా జరుగుతోందనంటూ వెక్కి వెక్కి ఏడ్చాను’’ అని సూయశ్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ చేదు అనుభవం నుంచి త్వరగానే కోలుకున్నానన్న సూయశ్‌.. తన నైపుణ్యాలకు మరింత పదునుపెట్టానని.. ఏదో ఒకరోజు ఇంటి నుంచే తన సెలక్షన్‌ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానన్నాడు.

ఐపీఎల్‌-2023 మినీ వేలం రూపంలో తన కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా ఎన్నో అవమానాల తర్వాత తన కెరీర్‌లో ఆర్సీబీ వంటి పటిష్ట జట్టుతో తొలి ప్రొఫెషనల్‌ మ్యాచ్‌ ఆడిన సూయశ్‌.. తనదైన ముద్ర వేయగలిగాడు. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సూయశ్‌ 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.

చదవండి: షాపులో పనిచేసి.. కష్టాలకోర్చి.. ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూ!; జై షా ట్వీట్‌ వైరల్‌
రనౌట్‌ విషయంలో సంజూ భాయ్‌ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement