ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్‌’ | Kimi Antonelli Now has an F1 Hat-Trick | Sakshi
Sakshi News home page

ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్‌’

May 5 2026 5:44 AM | Updated on May 5 2026 5:44 AM

Kimi Antonelli Now has an F1 Hat-Trick

మయామి గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

ఫ్లోరిడా: ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్‌ జట్టు టీనేజ్‌ డ్రైవర్‌ కిమీ ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్‌’ విజయం అందుకున్నాడు. సీజన్‌లోని నాలుగో రేసు మయామి గ్రాండ్‌ప్రిలో ఇటలీకి చెందిన 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణిత 57 ల్యాప్‌ల రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించిన ఆంటోనెల్లి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 33 నిమిషాల 19.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌ లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో నిలువగా... ఆస్కార్‌ పియాస్ట్రి (మెక్‌లారెన్‌) మూడో స్థానాన్ని పొందాడు. 

మొత్తం 22 మంది డ్రైవర్లలో నలుగురు రేసును పూర్తి చేయలేకపోయారు. సీజన్‌ తొలి రేసు ఆ్రస్టేలియన్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌కే చెందిన జార్జి రసెల్‌ విజేతగా నిలువగా... తర్వాతి మూడు రేసుల్లో (చైనా, జపాన్, మయామి) ఆంటోనెల్లికి టైటిల్‌ దక్కింది. ఫార్ములావన్‌ చరిత్రలో తన కెరీర్‌లోని తొలి మూడు పోల్‌ పొజిషన్‌ల నుంచి మూడు రేసుల్లోనూ గెలిచిన తొలి డ్రైవర్‌గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. తదుపరి రేసు కెనడియన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. 22 రేసుల ఈ సీజన్‌లో నాలుగు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 100 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement