IPL 2022 LSG Vs RCB: అతడొక అద్భుతం.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ క్రికెటర్‌

IPL 2022: Wasim Jaffer Says Lucknow Regret Not Finishing In Top 2 - Sakshi

IPL 2022 LSG Vs RCB: ‘‘ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌కు మంచి జట్లు దొరికాయి. ఈ రెండింటిలో పంజాబ్‌తో పోలిస్తే లక్నో మంచి ప్రదర్శన నమోదు చేసింది. సీజన్‌ ఆరంభంలోనే అదరగొట్టింది. చక్కగా ఆడింది. కానీ టాప్‌-2లో అడుగుపెట్టలేకపోయింది. ఇందుకు వారు పశ్చాత్తాపపడక తప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అన్నాడు.

కొత్త ఫ్రాంఛైజీ లక్నోను దురదృష్టం వెక్కిరించిందని టాప్‌-2లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నోకు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్‌లలో లక్నో తొమ్మిదింట గెలిచి 18 పాయింట్లు సాధించింది.

అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది. రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ నేరుగా క్వాలిఫైయర్‌-1కు అర్హత సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ టైటిల్‌ రేసులో నిలిచే మరో అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడిన లక్నో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

టాస్‌ మొదలు.. ఫీల్డింగ్‌ తప్పిదాలు, బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిని మూటగట్టుకుని ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశాడు. ఇక పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి.. 14 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. 

పాటిదార్‌ అద్భుతం చేశాడు!
ఆర్సీబీని గెలిపించిన రజత్‌ పాటిదార్‌ను వసీం జాఫర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసించాడు. ‘‘సూపర్‌స్టార్ల మధ్య ఓ అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకోవడం చాలా కష్టం. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి రజత్‌ పాటిదార్‌ ఈ విషయాన్ని సుసాధ్యం చేశాడు’’ అని కొనియాడాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-05-2022
May 26, 2022, 13:16 IST
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్‌-2022లో కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని లక్నో...
26-05-2022
May 26, 2022, 12:19 IST
రజత్‌ పాటిదార్‌పై కోహ్లి ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే!
26-05-2022
May 26, 2022, 11:48 IST
IPL 2022 LSG Vs RCB- Rajat Patidar: ఐపీఎల్‌-2022లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌తో జరిగిన...
26-05-2022
May 26, 2022, 11:25 IST
IPL 2022 Eliminator LSG Vs RCB: ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ప్లే ఆఫ్స్‌ చేరిన లక్నో సూపర్‌...
26-05-2022
May 26, 2022, 09:26 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో లక్నో...
26-05-2022
May 26, 2022, 07:43 IST
ఐపీఎల్‌ లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600...
26-05-2022
May 26, 2022, 05:43 IST
రజత్‌ పటిదార్‌ బెంగళూరుకు బంగారంలా మారాడు. ఐపీఎల్‌ వేలంలో ఎవరూ తీసుకోకపోగా, రెండు లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత బెంగళూరు జట్టు...
26-05-2022
May 26, 2022, 00:23 IST
లక్నో ఔట్‌.. క్వాలిఫయర్‌-2కు ఆర్‌సీబీ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ ​క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో...
25-05-2022
May 25, 2022, 22:50 IST
విరాట్‌ కోహ్లి ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తోడో.. ఆఫ్‌ ఫీల్డ్‌లో అంత సరదాగా ఉంటాడు. తననే ఫోకస్‌ చేస్తూ కెమెరామన్‌...
25-05-2022
May 25, 2022, 22:01 IST
ఆర్‌సీబీ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సూపర్‌ శతకంతో మెరిశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పాటిదార్‌...
25-05-2022
May 25, 2022, 21:18 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్‌సీబీ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది....
25-05-2022
May 25, 2022, 15:35 IST
 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? సక్కగా నిద్రపో!
25-05-2022
May 25, 2022, 13:54 IST
ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం ఆర్సీబీదే అన్న టీమిండియా మాజీ క్రికెటర్‌
25-05-2022
May 25, 2022, 12:43 IST
IPL 2022 GT Vs RR: ఐపీఎల్‌-2022 ఫైనల్‌ చేరాలంటే గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో రాజస్తాన​ రాయల్స్‌కు పరాభవమే ఎదురైంది....
25-05-2022
May 25, 2022, 11:32 IST
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్‌-2022 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. క్వాలిఫైయర్‌-1లో రాజస్తాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌...
25-05-2022
May 25, 2022, 09:49 IST
ఆ సెంటిమెంట్‌.. అప్పుడు కేకేఆర్‌, ఇప్పుడు గుజరాత్‌.. టైటిల్‌ మాదే అంటున్న ఫ్యాన్స్‌!
25-05-2022
May 25, 2022, 09:03 IST
పెద్దగా ఫీలింగ్స్‌ ఏమీ లేవు.. సంతోషంగా ఉన్నా.. దీనంతటికీ కారణం వాళ్లే: హార్దిక్‌ పాండ్యా
25-05-2022
May 25, 2022, 08:57 IST
IPL 2022 GT Vs RR: ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఓ చెత్తరికార్డు నమోదు చేశాడు. ఒక...
25-05-2022
May 25, 2022, 07:48 IST
IPL 2022 GT Vs RR: కోల్‌కతా- ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోనే సరిపెట్టుకోలేదు....
24-05-2022
May 24, 2022, 19:09 IST
ఐపీఎల్‌-2022 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ అడుగుపెట్టింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం... 

Read also in:
Back to Top