SRH Vs RCB Playing XI: వారి స్థానంలో తుది జట్టులోకి ఆ ఇద్దరు: విలియమ్సన్

IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ స్థానంలో ఫజల్‌హక్ ఫారూకీ, జగదీశ సుచిత్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ విషయంపై స్పందించిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ‘‘టాస్ ఓడిపోయాం కాబట్టి మాకు నచ్చిన అంశం ఎంచుకునే వీల్లేదు. అయితే మేము ఛేజింగ్ బాగా చేస్తాం. ముఖ్యంగా బంతితో రాణించాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక అబాట్, గోపాల్ స్థానంలో ఫారూకీ, సుచిత్ జట్టులోకి వచ్చినట్లు కేన్ మామ తెలిపాడు. ఇక ఎప్పుడూ టాస్ గెలిచే కేన్‌ను తాను ఓడించడం సంతోషంగా ఉందని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొనడం విశేషం.
ఐపీఎల్ మ్యాచ్ 54: సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ
తుదిజట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్ ఫారూకీ, ఉమ్రాన్ మాలిక్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ):
విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్.
#RCB have won the toss and they will bat first against #SRH.
Live - https://t.co/tEzGa6a3Fo #SRHvRCB #TATAIPL pic.twitter.com/RKKros4phJ
— IndianPremierLeague (@IPL) May 8, 2022
మరిన్ని వార్తలు