
ఎంఎస్ ధోని(ఫైల్‌ఫోటో)
ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. జడేజా ఎక్కడ ఫీల్డింగ్ చేస్తే క్యాచ్ అక్కడకే వెళ్లడం దాన్ని మనోడు కసిగా పట్టుకోవడం సీఎస్‌కే అభిమానులకు కనువిందు చేసింది. జడేజా క్యాచ్ పట్టినప్పుడల్లా ఏదొక విన్యాసంతో ఫ్యాన్స్‌ను అలరించాడు. బౌండరీకి కాస్త దూరంలో ఒక క్యాచ్ అందుకున్నప్పుడు కావాలనే బౌండరీ లైన్ దగ్గరకంటూ వెళ్లి బంతిని సరదాగా లైన్ లోపల జారవిడిచినట్లు యాక్షన్ చేసిన జడేజా.. మరొక క్యాచ్‌కు డ్వేన్ బ్రేవో స్టైల్‌తో అలరించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఉనద్కట్ ఇచ్చిన క్యాచ్ పట్టిన అనంతరం జడేజా సెలబ్రేట్ చేసుకున్న తీరు అభిమానులను ఆకర్షిస్తోంది.
నాలుగు క్యాచ్‌లు పట్టినందుకు గుర్తుగా నాలుగు వేళ్లు చూపించడమే కాకుండా చెవు దగ్గర చేతిని పట్టుకుని బ్రేవో తరచుగా వేసే స్టెప్పులను వేశాడు. కాగా, జడేజాకు సంబంధించి గతంలో ఎంఎస్ ధోని ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నాలుగు క్యాచ్‌లు పట్టడం, జడేజా ఎక్కడ ఉంటే అక్కడే క్యాచ్‌లు లేవడంతో ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ధోని చేసిన ట్వీట్ మళ్లీ వైరల్‌గా మారింది.
2013, ఏప్రిల్ 9వ తేదీన ధోని ఇలా ట్వీట్ చేశాడు.. ‘సర్ జడేజా.. క్యాచ్ కోసం పరుగు తీయకు. ఆ బంతే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ చేతుల్లో పడుతుంది’ అని ట్వీటర్‌లో కామెంట్ చేశాడు. ఆ ట్వీటే ఇప్పుడు మళ్లీ రీట్వీట్లు అవుతూ వైరల్ అవుతోంది. అరే అచ్చం. జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ఊహించి చెప్పినట్లే ధోని ముందే చెప్పాడే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కత్ క్యాచ్‌లను జడేజా అందుకున్నాడు. ఇక జోస్ బట్లర్, శివం దూబే వికెట్లను జడేజా ఖాతాలో వేసుకున్నాడు.
ఇక్కడ చదవండి: వైరల్: జడ్డూ.. నువ్వు వెరీ గుడ్డూ.. అంతేగా!
నా ఆటకు అప్పుడే గ్యారంటీ లేదు.. ఇప్పుడేంటి: ధోని
Sir jadeja doesn't run to take the catch but the ball finds him and lands on his hand
— Mahendra Singh Dhoni (@msdhoni) April 9, 2013