ఐపీఎల్‌ నకిలీ శబ్దాలపై సోషల్‌ మీడియాలో జోకులు

IPL 2020 Fake Crowd And Sound Memes Trending On Social Media - Sakshi

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌ సెప్టెంబర్‌19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకుల అనుమతి లేదన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల కేరింతలు, కోలాహలం లేక స్టేడియం బోసిపోతుందని ఐపీఎల్‌ యాజమాన్యం భావించింది. దీంతో వినూత్నంగా ఆలోచించి.. ప్రేక్షకుల కేరింతలు, చీర్ గర్ల్స్ సందడికి సంబంధించి రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చోని టీవీల్లో ఐపీఎల్‌ చూసే క్రికెట్‌ అభిమానులకు కొంత మేరకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఆటకు, రికార్డు చేసిన ప్రేక్షకులకు అరుపులకు బాగా సింక్‌ కుదురుతోంది. ఐపీఎల్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేస్తోంది. అయితే ఇలా చేయడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమతున్నాయి. ఈ అసహజ ప్రేక్షకులు కేరింతలు,శబ్దాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నకిలీ సమూహాలు, నకిలీ చీర్‌ గర్ల్స్, ప్రేక్షకుల అరుపులు మీద రకరకాల మీమ్స్‌, జోకులు పేల్చుతున్నారు. తాజాగా ఐపీఎల్‌ మీద వస్తున్న జోకులు సోషల్‌ మీడియాలో టేండ్‌ అవుతున్నాయి. (ఒక షార్ట్‌ రన్‌ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది)

‘సాధారణంగా టీవీ నెట్‌వర్క్‌లు ఉపయోగించే ఈ నకిలీ శబ్దాలు బాగానే ఉన్నాయి. కానీ, ఎవరు లేని క్రికెట్‌ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక జోక్‌’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ నకిలీ సమూల శబ్దాలాను ద్వేహిస్తున్నారు. 1994లో జరిగిన ఓ మ్యాచ్‌లోని నవ్వులను జోడించడం కొత్తగా ఉన్నప్పటికీ సహజంగా లేదు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘క్రికెట్‌ అభిమానులైన నా స్నేహితులు డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లను చూస్తే.. అవి ఎందుకు చూస్తున్నావు నిజమైన ఆట కాదు అది, నకిలీ క్రీడ అనేవారు. కానీ, నాకు ఇప్పుడు ఐపీఎల్‌ కూడా అలానే అనిపిస్తోంది’ అని మరో నెజటిన్‌ కామెంట్‌ చేశారు. ఇక ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజేతగా నిలిచింది. (ఫ్యాన్స్‌‌ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top