Indias First Female Racing Champion Alisha Abdullah Joins BJP - Sakshi
Sakshi News home page

Alisha Abdullah: బీజేపీలో చేరిన భార‌త తొలి మ‌హిళా రేస‌ర్

Sep 3 2022 7:41 PM | Updated on Sep 3 2022 7:58 PM

Indias First Female Racing Champion Alisha Abdullah Joins BJP - Sakshi

భారత తొలి మహిళా రేసింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. త‌మిళ‌నాడుకు చెందిన అలీషా.. శ‌నివారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. బీజేపీ కుటుంబంలో చేరినందుకు సంతోషంగా ఉందని, రాష్ట్ర బీజేపీ బాస్‌ అన్నామ‌లై కుప్పుస్వామి, అమర్‌ ప్రసాద్‌ రెడ్డి పిలుపు మేరకు తాను పార్టీలో చేరానని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది.

తమ పిలుపు మేరకు అలీషా పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని కలిగించిందని.. అలీషా చేరిక తమిళనాడు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నామలై, అమర్‌ ప్రసాద్‌ రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అలీషా..  పురుషాధిప‌త్యం కలిగిన రేసింగ్‌ క్రీడలో విశేషంగా రాణించి భారత తొలి నేషనల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.


చదవండి: సలాం 'సెరెనా విలియమ్స్'‌‌.. నీ ఆటకు మేము గులాం

Advertisement
 
Advertisement
Advertisement