‘శాఫ్‌’ అండర్‌–19 ఫుట్‌బాల్‌ విజేత భారత్‌ | India is the winner of SAF under19 football | Sakshi
Sakshi News home page

‘శాఫ్‌’ అండర్‌–19 ఫుట్‌బాల్‌ విజేత భారత్‌

Oct 1 2023 1:53 AM | Updated on Oct 1 2023 1:53 AM

India is the winner of SAF under19 football - Sakshi

ఖట్మండూ (నేపాల్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌లో భారత్‌ విజేతగా నిలవడం ఇదే ఎనిమిదో సారి కావడం విశేషం. భారత్‌ తరఫున మంగ్లెన్‌తంగ్‌ కిప్‌జెన్‌ రెండు గోల్స్‌ (64వ నిమిషం, 85వ నిమిషం) సాధించగా, గ్వాగమ్‌సర్‌ గోయరీ (90+5వ నిమిషం) మరో గోల్‌ కొట్టాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement