అరంగేట్రంలోనే అదరగొట్టారు.. చైనాకు షాకిచ్చిన భారత అమ్మాయిలు  | India Beat China In Womens Hockey Pro League | Sakshi
Sakshi News home page

FIH Pro League: అరంగేట్రంలోనే అదరగొట్టారు.. చైనాకు షాకిచ్చిన భారత అమ్మాయిలు 

Jan 31 2022 10:17 PM | Updated on Jan 31 2022 10:26 PM

India Beat China In Womens Hockey Pro League - Sakshi

FIH Pro League 2021-22: ఒమన్‌ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌(అంతర్జాతీయ హాకీ సమాఖ్య) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు  శుభారంభం లభించింది. సోమవారం చైనాను 7-1 గోల్స్‌ తేడాతో చిత్తుగా ఓడించిన భారత మహిళా జట్టు.. ప్రో లీగ్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సుశీల చాను(47వ నిమిషం, 52వ నిమిషం) రెండు గోల్స్‌తో రాణించగా.. నవనీత్‌ కౌర్‌, నేహా, వందనా కటారియా, షర్మిలా దేవీ, గుర్జీత్‌ కౌర్‌ తలో గోల్‌ చేశారు. చైనా తరఫున జు డెంగ్‌ 43వ నిమిషంలో గోల్‌ సాధించింది. ఈ విజయంతో భారత్‌ ప్రో లీగ్‌ 2021-22 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. 


చదవండి: విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement