
PC: BCCI
Ind vs Sa Test Series- 1st Test Updates: టీమిండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్ రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకి కలిగించాడు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రోజు ఆట రద్దైంది.
3: 30 PM: వరుణుడు కరుణించడం లేదు. టీమిండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు పదే పదే ఆటంకం కలిగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క బంతి కూడా పడకుండానే జట్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లాయి.
1: 40PM దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా టీమిండియా రెండో రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభం కానుంది. కాగా తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచిన సంగతి తెలిసిందే. మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక అజింక్య రహానే సైతం కెప్టెన్ కోహ్లి, హెడ్‌కోచ్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 40 పరుగులు సాధించి ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.
It's a rainy morning here in Centurion ⛈️
— BCCI (@BCCI) December 27, 2021
We are waiting for the skies to clear up 🤞🏻#TeamIndia | #SAvIND pic.twitter.com/wxkFWDEbnS