PSL 8: Ihsanullah, Rilee Rossouw shine as Multan Sultans win over Quetta Gladiators - Sakshi
Sakshi News home page

PSL 2023: రఫ్ఫాడించిన రొస్సో.. ఐదేసి ఇరగదీసిన ఇహసానుల్లా

Feb 16 2023 12:02 PM | Updated on Feb 16 2023 12:15 PM

Ihsanullah And Rilee Rossouw Shine In Multan Sultans Win Over Quetta Gladiators - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ రెచ్చిపోయారు. తొలుత గ్లాడియేటర్స్‌ను 110 పరుగులకే ఆలౌట్‌ చేసిన సుల్తాన్స్‌.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదే రేంజ్‌లో రెచ్చిపోయి కేవలం 13.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. సుల్తాన్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇహసానుల్లా ఫైఫర్‌తో (4-1-12-5) గ్లాడియేటర్స్‌ను గడగడలాడించగా.. బ్యాటింగ్‌లో రిలీ రొస్సో మెరుపు హాఫ్‌సెంచరీతో (42 బంతుల్లో 78 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.

ఫలితంగా సుల్తాన్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ చేతిలో భంగపడ్డ సుల్తాన్స్‌.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి బోణీ విజయం దక్కించుకుంది. మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సుల్తాన్స్‌.. ఇహసానుల్లా (5/12), అబ్బాస్‌ అఫ్రిది (2/27), సమీన్‌ గుల్‌ (2/20), ఉసామా మిర్‌ (1/19) చెలరేగడంతో ప్రత్యర్ధిని 18.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్‌ చేసింది. గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌లో జేసన్‌ రాయ్‌ (27), ఉమర్‌ అక్మల్‌ (11), మహ్మద్‌ నవాజ్‌ (14), హఫీజ్‌ (18), మహ్మద్‌ హస్నైన్‌ (22) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సుల్తాన్స్‌.. షాన్‌ మసూద్‌ (3) వికెట్‌ కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. వైవిధ్యమైన షాట్లతో రిలీ రొస్సో రెచ్చిపోగా.. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (28 నాటౌట్‌) నిలకడగా బ్యాటింగ్‌ చేసి సుల్తాన్స్‌ను గెలిపించారు. షాన్‌ మసూద్‌ వికెట్‌ నువాన్‌ తుషారకు దక్కింది. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 16) కరాచీ కింగ్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్లు తలపడనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement