ICC Test Rankings: టాప్‌-5కు దూసుకొచ్చిన అండర్సన్‌.. అశ్విన్‌ మాత్రం | ICC Test Rankings Ashwin Retains 2nd Position All-rounder-Bowler Tallies | Sakshi
Sakshi News home page

ICC Test Rankings: టాప్‌-5కు దూసుకొచ్చిన అండర్సన్‌.. అశ్విన్‌ మాత్రం

Dec 29 2021 9:18 PM | Updated on Dec 29 2021 9:23 PM

ICC Test Rankings Ashwin Retains 2nd Position All-rounder-Bowler Tallies - Sakshi

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.  అటు బౌలింగ్‌ విభాగంలో 883 పాయింట్లతో.. ఇటు ఆల్‌రౌండర్‌ విభాగంలో 360 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ విభాగంలో 346 పాయింట్లతో మూడోస్థానాన్ని కాపాడుకున్నాడు. 

బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 902 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది 822 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. యాషెస్‌ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్‌ పేసర్ జేమ్స్‌ అండర్సన్‌ మూడు స్థానాలు ఎగబాకి 813 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో మార్నస్‌ లబుషేన్‌ 915 పాయింట్లతో తొలిస్థానం కాపాడుకోగా.. జో రూట్‌ 900 పాయింట్లతో రెండో స్థానంలో.. ఇక స్టీవ్‌ స్మిత్‌ తన మూడో స్థానాన్ని కేన్‌ విలియమ్సన్‌కు కోల్పోయాడు. టీమిండియా నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు 5,7 స్థానాలను నిలుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement