
FIFA World Cup Qatar 2022- స్యాన్ జోస్: గత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన యూఎస్‌ఏ జట్టు ఈ సారి ఆ అడ్డంకిని అధిగమించింది. ఖతర్‌లో ఈ ఏడాది జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు అమెరికా క్వాలిఫై అయింది. తమ చివరి క్వాలిఫయర్ పోరులో అమెరికా 0–2తో కోస్టారికా చేతిలో ఓడినా ఆ జట్టు ముందంజ వేయడం విశేషం. గత వారం జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సొంతగడ్డపై 5–1 తేడాతో పనామాపై ఘన విజయం సాధించడం అమెరికాకు కలిసొచ్చింది.
కనీసం ఆరు గోల్స్ తేడాతో ఓడితే గానీ ఇబ్బంది లేని స్థితిలో బరిలోకి దిగిన యూఎస్...చివరకు పరాజయంపాలైనా వరల్డ్ కప్ అవకాశం మాత్రం దక్కించుకోగలిగింది. నవంబర్ 21నుంచి డిసెంబర్ 18 వరకు ఖతర్‌లో 2022 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది.
చదవండి: సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు
See you in November. 🇺🇸
— USMNT: Qualified. (@USMNT) March 31, 2022
🗣 @TimHowardGK pic.twitter.com/ZiX4E4JGir