అతడి కోసం ఢిల్లీ విరాట్‌ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్‌ | Delhi Rejected Virat Kohli For Sangwan In IPL Sehwag Reveals Full Story | Sakshi
Sakshi News home page

అతడి కోసం ఢిల్లీ విరాట్‌ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్‌

Apr 17 2026 12:29 PM | Updated on Apr 17 2026 1:30 PM

Delhi Rejected Virat Kohli For Sangwan In IPL Sehwag Reveals Full Story

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఇంత వరకు టైటిల్‌ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ (2008)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది.

తప్పటడుగు వేసి ఉండకపోతే..
అయినా సరే ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత విధ్వంసకర ఓపెనర్‌, ఢిల్లీ మాజీ ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఢిల్లీ ఫ్రాంఛైజీ గనుక ఆరోజు తప్పటడుగు వేసి ఉండకపోతే.. ఆ జట్టుకు మంచి క్రేజ్‌ అయినా దక్కి ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ వీరూ భాయ్‌ ఏం చెప్పాడంటే..

 టాపార్డర్‌ కిక్కిరిసిపోయి ఉండేది
‘‘ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ అంటే.. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో శిఖర్‌ ధావన్‌, తిలక్‌రత్నె దిల్షాన్‌ కూడా ఉన్నట్లు నాకు గుర్తు. వీరిద్దరు ఓపెనింగ్‌ బ్యాటర్లే. అయితే, నేను, గౌతమ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించేవాళ్లం.

కాబట్టి ధావన్‌, దిల్షాన్‌ ఆలస్యంగా వచ్చేవాళ్లు. మనోజ్‌ తివారి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. అప్పుడ మా టాపార్డర్‌.. ఇలా కిక్కిరిసిపోయి ఉండేది. కాబట్టి కొత్తగా బ్యాటర్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

కోహ్లికి బదులు జట్టులోకి అతడు
ఆ సమయంలో విరాట్‌ కోహ్లి వన్‌డౌన్‌ లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకోలేకపోయారు. అప్పుడు మాకు బౌలర్‌ అవసరం ఉంది. అందుకే కోహ్లికి బదులు ఢిల్లీ ప్రదీప్‌ సాంగ్వాన్‌ను జట్టులోకి తీసుకుంది’’ అని చాంపియన్స్‌ వాలీ కామెంట్రీలో జియోస్టార్‌ ఎక్స్‌పర్ట్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఆరోజు అలా ఢిల్లీ కోహ్లిని కెరీర్‌ తొలినాళ్లలో వదిలేసుకోగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజంగా ఎదిగినా.. కోహ్లి మాత్రం ఇప్పటికీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. 

కెప్టెన్‌గా ట్రోఫీ గెలవలేకపోయినా.. గతేడాది రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ తరఫున కోహ్లి తొలిసారి కప్పును ముద్దాడాడు. మరోవైపు.. ఢిల్లీ టైటిల్‌ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.

చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement