IPL 2023 Mini Auction-Cameron Green: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు?

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ ఎవరు ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. శుక్రవారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కామెరున్ గ్రీన్‌ది రెండో అత్యధిక ధర. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదే వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడంతో అతను తొలిస్థానంలో ఉన్నాడు.
ఇక ఈసారి వేలంలో హాట్ ఫేవరెట్ గా ఉన్న కామెరున్ గ్రీన్ అంత ధరకు పలుకుతాడని ఎవరు ఊహించి ఉండరు. రూ. 10 నుంచి 15 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరి కామెరున్ గ్రీన్‌కు దీనిని అందుకునే అర్హత ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అయితే గ్రీన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. 23 ఏళ్ల వయసు మాత్రమే కలిగిన గ్రీన్ ఆస్ట్రేలియా తరపున 2020లో అడుగుపెట్టాడు.
కామెరున్ గ్రీన్ అటు కొత్త బంతితో, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సమర్థుడు. అంతేకాదు బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. మంచి ఫీల్డర్ కూడా. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న కామెరున్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా తరపున కామెరున్ గ్రీన్ 20 టెస్టులు, 13 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్‌లు ఆడాడు.
.@mipaltan win the bidding war to welcome Australian all-rounder Cameron Green!💰✅
He is SOLD for INR 17.5 Crore 👏 👏#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/tJWCkRgF3O
— IndianPremierLeague (@IPL) December 23, 2022
చదవండి: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు