Border Gavaskar Trophy (BGT) 2023: India Vs Australia 3rd Test Day 3 Live Score Updates In Telugu - Sakshi
Sakshi News home page

IND VS AUS : టీమిండియా ఓటమి.. ఇండోర్‌ టెస్టులో ఆసీస్‌ గెలుపు

Mar 3 2023 9:33 AM | Updated on Mar 3 2023 10:56 AM

BGT 2023 IND VS AUS 3rd Test Live Updates And Highlights - Sakshi

Ind Vs Aus 3rd Test Indore 3rd Day Updates: 

టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్‌
ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవి చూసింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది. ఆసీస్‌ బ్యాటర్లు ట్రెవిస్‌ హెడ్‌(49), మార్నస్‌ లాబుషేన్‌(28) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.

భారత బౌలర్లలో అశ్విన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఇక అంతకుముందు భారత్‌ తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. దీంతో ఆసీస్‌ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్‌ ఉంచగల్గింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో కూడా టీమిండియా కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు మాత్రమే చేయగల్గింది.
11 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు  26/1
ఆసీస్‌ గెలవాలంటే ఇంకా 50 పరుగులు అవసరం. అయితే, టీమిండియా స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ఆసీస్‌ బ్యాటర్లను నిలువరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

9 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 13/1
లబుషేన్‌ 7, ట్రవిస్‌ హెడ్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు:  5-1
ట్రవిస్‌ హెడ్‌, లబుషేన్‌ క్రీజులో ఉన్నారు.

ఖవాజా డకౌట్‌
ఇండోర్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా రెండో టెస్టు మూడో రోజు  ఆట ప్రారంభమైంది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో ఉస్మాన్‌ ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు.

తుది జట్లు.. 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్, రవిచంద్రన్‌ అశ్విన్, అక్షర్ పటేల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌

ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్), ట్రవిస్‌ హెడ్, ఉస్మాన్‌ ఖ్వాజా, మార్నస్‌ లబూషేన్, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్, కెమరూన్‌ గ్రీన్, అలెక్స్‌ క్యారీ, మిచెల్‌ స్టార్క్, టాడ్‌ మర్ఫీ , నాథన్‌ లియోన్, మార్క్‌ కుహ్నేమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement